తెలంగాణా కోసం పదవులను త్యాగం చేసిన వారినే తిరిగి గెలిపించండి.
కేవలం గెలవడంకోసం తెలంగాణావాదం చేస్తున్న అవకాశవాదులను ఓడించండి.
శ్రీకృష్ణ కమిటీ ఎదుట నోరు విప్పని వినాయకులు 'తెలంగాణా తెచ్చేదీ మేమే, ఇచ్చేదీ మేమే'' అంటూ మాయ మాటలు చెపుతున్నారు. ఇంకా వారి మాటల గారడిలో పడకండి. ఇటువంటి కుహనా తెలంగాణా వాదుల భరతం పట్టండి.
తెలంగాణా కోసం రాజీనామా చేసిన వారినే గెలిపించండి. తెలంగాణా వాదం, తెలంగాణా ఉద్యమం ఎంత ప్రబలంగా ఉన్నదో ఎంత పటిష్టంగా ఉన్నదో , ఎంత పదునుగా ఉన్నదో నిరూపించండి.
శ్రీకృష్ణ కమిటీ ఆంధ్రప్రదేశ్ లో సంచరిస్తున్నందున ఈ ఉపఎన్నికలే అత్యంత కీలకం.
తెలంగాణా కోసం రాజీనామా చేసిన వారిని గెలిపించుకోలేకపోతే తెలంగాణా ఉద్యమం బలహీనంగా ఉన్నదన్న సంకేతాలు కమిటీకి అందే ప్రమాదం ఉన్నది.
తెలంగాణా కోసం ఆత్మార్పణం చేసిన అమరవీరుల త్యాగాలకు విలువ లేకుండా పోతుంది. తెలంగాణా వాదాన్నీఉద్యమాన్నీ అత్యంత శక్తిమంతంగా మలచిన మేధావుల ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరవుతుంది.
1969 కన్నా బలంగా, దృడంగా ఉద్యమాన్ని నడిపిస్తున్న విద్యార్థుల, విద్యార్థి నాయకుల కఠోర దీక్షలు వృధా అవుతాయి. తెలంగాణా వాదాన్నీఉద్యమాన్నీ బలపరుస్తున్న రాజకీయపార్టీల, నేతల పరిస్థితి డోలాయమానం అవుతుంది. తెలంగాణా ఉద్యమానికి వెన్ను దన్నుగా నిలిచిన ప్రవాస తెలంగాణా బిడ్డల ప్రయత్నం నీరుగారి పోతుంది.
కలలో మెలకువలో మీకు కనిపించేది తెలంగాణా ఒక్కటే. కనులముందు మీకు కనిపించేది తెలంగాణా కోసం రాజీనామా చేసిన నాయకులే. మీరు గెలిపించేది తెలంగాణా కోసం రాజీనామా చేసిన ఆ నాయకులనే. .
జై తెలంగాణా.....జై జై తెలంగాణా ....
జై తెలంగాణా NRI ఫోరం












